Tamilnadu New CM SasiKala Comming Soon 9th

ఆదివారం ఉదయం నుంచే ఉత్కంఠం :

           తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ అధికార పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. అధికార పక్షం అన్నడీఎం కే  శాసనపక్ష నేతగా ఆదివారం ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శాసనసభ పక్ష సమావేశంలో ఆమె పేరును ఇప్పటి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రతిపాదించగా పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా తమ ఆమోదం తెలిపారు. సమావేశం తరువాత   పన్నీరు సెల్వం తన రాజీనామాను ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు కి పంపారు.

sasikala recent photos

అటు నుంచి ఆటే గవర్నర్ ఢిల్లీ కి :

          కోయంబత్తూరులో ఉన్న వై రామనాథపురం లో ఉన్న జెమ్ ఆస్పత్రిలో రోబోటిక్ శస్త్రచికిత్స కంద్రాన్ని ప్రారంభించడానికి వెళ్లిన తమినాడు గవర్నర్ విద్యాసాగర్ రావు అటు నుంచి ఆటే ఢిల్లీ కి వెళ్లి  రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలఫై అయన మన ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలుస్తుంది. 
Share on Google Plus